Kadthal: ఎక్వాయిపల్లిలో చేయూత పింఛన్ పత్రాల పంపిణీ
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లిలో లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్ అందజేశారు.
Kadthal: ఎక్వాయిపల్లిలో చేయూత పింఛన్ పత్రాల పంపిణీ
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను గురువారం సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 95 శాతం మందికి పింఛన్లు మంజూరు కావడం హర్షణీయమన్నారు. త్వరలో అమలు కానున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పుట్టి లక్ష్మి యాదయ్య, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




