Kadthal: రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం ఎమ్మెల్యే కసిరెడ్డి

Kadthal: కడ్తాల్‌లో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా. కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 July 2026 2:45 PM IST
Kadthal
X

Kadthal: రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం ఎమ్మెల్యే కసిరెడ్డి

కడ్తాల్: రాహుల్ గాంధీ గారి అరెస్టును తీవ్రంగా ఖండించిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి l ఆధ్వర్యంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కడ్తాల పట్టణంలో నిరసన కార్యక్రమాలు రాస్తారోకో నిర్వహించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ, హక్కుల కోసం పోరాడుతున్న నాయకుల గొంతును అణిచివేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీ గారికి తమ సంఘీభావాన్ని తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story