Kadthal: నిరుపేద కుటుంబాలకు రాధాకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
Kadthal: కడ్తాల్ మండలంలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్.
Kadthal: నిరుపేద కుటుంబాలకు రాధాకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
కడ్తాల్: కడ్తాల్ మండలంలోని ముగ్గురు నిరుపేద బాధిత కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బుధవారం ఆర్థిక సాయం అందించారు. కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ, ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ తన ట్రస్ట్ తరఫున వాసుదేవపూర్ గ్రామానికి చెందిన పాత్లవత్ పులియా, మైసిగండి గ్రామానికి చెందిన రామావత్ మారోని, కడ్తాల్ గ్రామానికి చెందిన మాదారం నాగమణికి తలా రూ.5 వేల చొప్పున మొత్తం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు.
అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ మాదారం నాగమణి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని తన వంతుగా మరో రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. దీంతో నాగమణి కుటుంబానికి మొత్తం రూ.10 వేల సాయం అందింది. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని దశరథ్ నాయక్, ఆనంద్ తెలిపారు.
ఆపదలో అండగా నిలిచిన నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రియా రమేష్, శీను నాయక్, మాజీ ఎంపీటీసీలు లచ్చిరామ్ నాయక్, సక్రి, మాజీ సర్పంచ్ తులసిరామ్ నాయక్, హరిచంద్ నాయక్, నరేందర్ నాయక్, గోపాల్, పత్తి వినోద్, భాను, వెంకటేష్, కృష్ణయ్య, శీను, సుభాష్, ప్రేమ్, గౌతమ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.




