Kadthal: చరికొండలో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేసిన సర్పంచ్
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చరికొండ గ్రామపంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమం; ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలని సర్పంచ్ పిలుపు.
Kadthal: చరికొండలో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేసిన సర్పంచ్
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పోలియో రహిత భారతదేశమే లక్ష్యంగా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని చరికొండ గ్రామ సర్పంచ్ అద్దాల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం చరికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఆరు వారాల నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బలవంత్ రెడ్డి, వార్డు సభ్యులు బాలకృష్ణ, అంజి నాయక్, నరసింహ, మహేష్, వెంకటయ్య, వరలక్ష్మి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




