Kadthal: కడ్తాలలో మహిళలకు ఉప్పల ట్రస్ట్ చీరల పంపిణీ!

Kadthal: సద్దుల బతుకమ్మ సందర్భంగా కడ్తాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఉప్పల వెంకటేష్ గుప్తా సేవా కార్యక్రమాలపై ప్రశంసలు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Oct 2026 5:30 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాలలో మహిళలకు ఉప్పల ట్రస్ట్ చీరల పంపిణీ!

కడ్తాల: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శనివారం కడ్తాల మండల కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్ లతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు అతి పెద్ద పండుగ అయిన సద్దుల బతుకమ్మ సందర్భంగా పేద మహిళలకు చీరలు అందజేసి ట్రస్ట్ సభ్యులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీరలు అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా చేస్తున్న సేవలను మహిళలు అభినందించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు పేదలకు అండగా ఉండటమే తమ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు అమృతం పాండు, రాష్ట్ర యూత్ సెక్రెటరీ హెచ్ఆర్ మహేష్, నాయకులు లాయక్ అలీ, జగదీష్, కంబాలపల్లి అంజి, కంబాలపల్లి దాసు, కంబాలపల్లి శ్రీకాంత్, కంబాలపల్లి సురేష్, వెంకటేష్, ముబీన్, ఆదివాసి సంఘం అధ్యక్షుడు శ్రీశైలం, సోషల్ మీడియా కన్వీనర్ సాయి, కిరణ్, ఒగ్గు మహేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY