Hyderabad: ఘనంగా కైలాస్ మానస సరోవర్ యాత్రికుల సమ్మేళనం

Hyderabad: కైలాస్ మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో గాయత్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌ల సమ్మేళనం నిర్వహించారు.

RAJESH,	WEST ZONE
Published on: 10 May 2026 12:19 PM IST
Hyderabad
X

Hyderabad: ఘనంగా కైలాస్ మానస సరోవర్ యాత్రికుల సమ్మేళనం

హైదరాబాద్: నేటి నుంచి మొదలుకానున్న కైలాస్ మానస సరోవర్ యాత్ర సందర్భంగా గాయత్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఈ యాత్రికుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ అధినేత పివి భరత్ కుమార్ తో పాటు ఆచార్య కాకునూరు సూర్యనారాయణమూర్తి, సంతోష్ కుమార్ ఘనపాటి, శ్యామలానంద భారతి, నందిబట్ల సత్యనారాయణ శర్మ పాల్గొని కైలాస్ మానస సరోవర్ యాత్ర విశేషాలతో పాటు ఈ యాత్ర చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 2000 మంది యాత్రికులు ఈ యాత్రకు వెళ్తుంటారని తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story