Hayathnagar: హయత్‌నగర్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన నవజీవన్ రెడ్డి!
Hayathnagar: భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల సవరణ (SIR) కార్యక్రమాన్ని హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.
Hayathnagar: హయత్‌నగర్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన నవజీవన్ రెడ్డి!
Hayathnagar: భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న (SIR) కార్యక్రమాన్ని హయత్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ బూత్ ఏజెంట్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా హయత్‌నగర్ వార్డు కార్యాలయం, రంగనాయకుల గుట్ట, ఆటో సాయి నగర్ కమిటీ హాల్‌తో పాటు డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని సందర్శించి, నమోదు ప్రక్రియ, పత్రాల పరిశీలన, ఓటర్లకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం, అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా ఓటరు జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించబడుతుందని తెలిపారు.
కార్యక్రమం అమలులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవసరమైన పత్రాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రతి అర్హుడైన ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తన వివరాలను సరిచూసుకుని అవసరమైతే సవరణలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని కళ్లెం నవజీవన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్ మరియు నాయకులు ఎర్ర శ్రీకాంత్ కురుమ, ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.




