Secunderabad: ఆరు గ్యారంటీలు అమలు చేయని రేవంత్ సర్కార్‌పై కవిత ధ్వజం
Secunderabad: సికింద్రాబాద్ చిలకలగూడలో పార్టీ జెండా ఎగురవేసిన కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపాటు.
Secunderabad: ఆరు గ్యారంటీలు అమలు చేయని రేవంత్ సర్కార్‌పై కవిత ధ్వజం
సికింద్రాబాద్: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష ప్రాత పోషిస్తూ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగు అడిగినా ప్రశ్నిస్తుందని తెలంగాణ రక్షణ సేన పార్టీ (టిఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
సికింద్రాబాద్ చిలకలగూడ గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ పార్టీ నాయకుల,కార్యకర్తలతో కలిసి కవిత టిఆర్ఎస్ జండాను ఎగురవేశారు.
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యాటెంటీలు అమలు చేయలేని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశపడుతున్నారని ఎట్లా వస్తారని ఆమె ప్రశ్నించారు.
ఎట్లా వస్తరు అధికారంలోకి పెన్షన్ పెంచినని వస్తరా ,కొత్త పెన్షన్ ఇచ్చినామని వస్తరా,పీజు రీయంబర్స్ ఇచ్చినరా,రైతులకు ఇచ్చిన మాటలు మోసం చేసి ముపై వేల కోట్లు ఎగవేసినరని అధికారంలో వస్తారని కవిత సీఎం ను ప్రశ్నించారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల తోపాటు ఏం ఎల్ ఏ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన గెలుపు జండా ఎగురవేస్తామని కవిత దీమా వ్యక్తం చేశారు.




