Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అక్రమ గోవుల తరలింపు భగ్నం కంటైనర్ సీజ్!

Hyderabad: కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న 65 గోవులను పట్టుకుని సీజ్ చేసిన పోలీసులు; ముగ్గురు కూలీల అదుపులోకి.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 1 Sept 2026 9:44 AM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అక్రమ గోవుల తరలింపు భగ్నం కంటైనర్ సీజ్!

Hyderabad: పాతబస్తీ కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. బాబానగర్‌లో కంటైనర్‌లో గోవులను తరలిస్తున్నారంటూ డయల్ 100కు సమాచారం అందడంతో కాంచన్‌బాగ్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

కాంచన బాగ్ సిఐ బాలరాజు, చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న నైట్ డ్యూటీ ఆఫీసర్లు కంటైనర్‌ను తనిఖీ చేయగా.. అందులో 36 ఆవులు, 29 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కంటైనర్‌ను సీజ్ చేసి, గోవులను స్థానిక గోశాలకు తరలించారు.

కంటైనర్ ఎవరిది? ఎక్కడి నుంచి గోవులను తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్‌లో ఉన్న ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

Next Story