Kapra: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి: సీఐటీయూ డిమాండ్!
Kapra: ఓట్ల తొలగింపును నిరసిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాప్రా చర్లపల్లిలో సీఐటీయూ టార్చ్ లైట్ల ప్రదర్శన చేపట్టింది.
Kapra: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి: సీఐటీయూ డిమాండ్!
కాప్రా: సర్ పేరుతో ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తొత్తుగా మారిన కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ని వెంటనే తొలగించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో టార్చ్ లైట్లు నిరసనతో ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చర్లపల్లి అధ్యక్షులు బివి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కు ని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ తొందర తొక్కుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తొత్తుగా మారి అర్హత కలిగిన వారందరి ఓట్లను తొలగిస్తుందని అన్నారు.
ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య. ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న ఈ ఓటు దోపిడీ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని సర్ ప్రక్రియను రద్దు చేయాలని తొలగించిన వారి ఓట్లను వెంటనే చేర్చాలని, ఇప్పటివరకు దేశములో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. వారిని ప్రజాస్వామ్య పద్ధతిలో వెంటనే ఓటు అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు.
వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ జ్ఞానేస్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించే వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల ప్రధాన కార్యదర్శిలు టీ. నరసింహ, మణికంఠ, టి. రవీందర్ రెడ్డి, పి. శ్రీనివాస్, కే.బాలరాజ్, కే. సంతోష్, బి ఆదాము, రాంబాబు, మునిస్వామి సోమాచారి, విజయ్, తదితరులు పాల్గొన్నారు.




