Kapra: కాప్రా చెరువుకు సరికొత్త లుక్.. రూ.35 కోట్లతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్కెచ్!
Kapra: ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
Kapra: కాప్రా చెరువుకు సరికొత్త లుక్.. రూ.35 కోట్లతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్కెచ్!
Kapra: కాప్రా చెరువు వద్ద కాప్రా చెరువు పునరుద్ధరణ సుందరీకరణ పనుల ప్రారంభోత్సవ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బైరీ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై పనులను ప్రారంభించారు. కాప్ర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాప్రా చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 35 కోట్ల రూపాయల ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపేలా వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా కాప్రా చెరువు సుందరీకరణ కోసం సుమారు రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ పనులు పూర్తయిన తర్వాత కాప్రా చెరువు నగరంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, స్థానిక ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మెన్ రావుల శ్రీధర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ లు కొత్త రామారావు , ప్రభుదాస్, శ్రీనివాస్ రెడ్డి , గొల్లురి అంజయ్య, పన్నాల దేవేందర్ రెడ్డి, BRS పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి సాయి జెన్ శేఖర్ , బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గంధం నాగేశ్వర్ రావు ,నీలం రెడ్డి , దామోదర్, BA రాంచందర్ గౌడ్,సంజీవ రెడ్డి BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




