Kapra: సీసీఎస్ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపల్లి పద్మారెడ్డి ఎన్నిక
Kapra: కాప్రా సర్కిల్ కాలనీ కమిటీల సమాఖ్య (సీసీఎస్) అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపల్లి పద్మారెడ్డి; త్వరలోనే పూర్తిస్థాయి కమిటీ ఎంపిక.
Kapra: సీసీఎస్ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపల్లి పద్మారెడ్డి ఎన్నిక
కాప్రా: గడిచిన ఆరేళ్లుగా కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ పేరుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తుందని రెండవసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపల్లి పద్మా రెడ్డి అన్నారు.
ఆదివారం కాప్రా సర్కిల్ పరిధిలోని కాలనీ సంఘాల సభ్యులు ఒకటై శివ సాయి నగర్ శివ సాయి దేవాలయ ప్రాంగణంలో సిసిఎస్ అధ్యక్షునిగా పద్మా రెడ్డిని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కు చెందిన వివిధ విభాగాల అధికారులు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. త్వరలోనే సిసిఎస్ పూర్తిస్థాయి కమిటీని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.




