Kapra: అమ్మవారి మండపాల్లో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పూజలు!

Kapra: కుషాయిగూడ డివిజన్ పరిధిలోని పలు అమ్మవారి మండపాల్లో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

ASHOK, KAPRA
Published on: 16 Oct 2026 4:38 PM IST
Kapra
X

Kapra: అమ్మవారి మండపాల్లో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పూజలు!

కాప్రా: కుషాయిగూడ డివిజన్ పరిధిలోని స్మాషర్స్ బాక్స్ క్రికెట్, జమ్మిగడ్డ లోని నెహ్రూ నగర్ వజ్రా యూత్ అసోసియేషన్, వాసవి శివ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి మండపాలలో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో ఆయా అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA