Kapra: ఘనంగా లైన్స్ క్లబ్ 320C ప్రమాణ స్వీకార మహోత్సవం
Kapra: కాప్రాలో ఘనంగా లైన్స్ క్లబ్ 320C నూతన గవర్నర్ కళ్లెం కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం. ఆహారాన్ని వృధా చేయవద్దని మాజీ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు పిలుపు.
Kapra: ఘనంగా లైన్స్ క్లబ్ 320C ప్రమాణ స్వీకార మహోత్సవం
కాప్రా: మనం తినే ప్రతి మెతుకు పరబ్రహ్మ స్వరూపమని ఒక మెతుకు కూడా వృధా చేయవద్దని లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా మద్దూరి స్వరూప గార్డెన్లో లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320 సి నూతన గవర్నర్ కళ్లెం కృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన 11వ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంటిలో ప్రతి మెతుకు విలువ కడతామని అదేవిధంగా ఫంక్షన్లలో కూడా బలవంతంగా ఆహారం వేసుకొని వృధా చేయవద్దని తినగలిగినంతనే వేసుకోవాలని తినగలిగినంతనే వడ్డించాలని 50% పైగా అన్నం వృధా చేస్తున్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
50 నుంచి 70% అన్నావ్ కదా అన్నం వృధా అయితే లక్షలాది రూపాయలు నష్టపోవడంతో పాటు మనకు కన్నాన్ని సరఫరా చేసే రైతు కష్టానికి వెలకట్టలేమని ఆయన కష్టానికి వృధా చేసినట్లు అవుతుందని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. లైన్స్ క్లబ్ ద్వారా సేవలందించడానికి ముందుకు వచ్చి తమ సొంత డబ్బులను ఖర్చు చేస్తూ సేవలను చేస్తున్న లైన్స్ క్లబ్ వారందరినీ అభినందించారు.
అట్టి డబ్బులు వృధా కాకుండా పొదుపుతో ఖర్చు చేయాలని సూచించారు. 11వ డిస్టిక్ 320c అధ్యక్షునిగా ఎన్నికైన కళ్లెం కృష్ణారెడ్డి అంతర్జాతీయ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో హాంకాంగ్లో ప్రమాణ స్వీకారం చేయగా, కాప్రా మరో అంతర్జాతీయ మాజీ డైరెక్టర్ కేజీ రామకృష్ణమూర్తి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా వ్యవహరించి మొదటి వైస్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ మండా సురేష్, రెండవ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటుక శేఖర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి కళ్లెం మోహన్ రెడ్డి, కోశాధికారి మూలవర్తి శ్రీనివాస్, డిస్టిక్ చీఫ్ కోఆర్డినేటర్ గుడి గంటల రాములు ఈ సందర్భంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ మల్టిపుల్ గవర్నర్లు మాజీ గవర్నర్లు కోఆర్డినేటర్లు ,కార్యక్రమంలో మాజీ గవర్నర్లు డాక్టర్ కే హరీష్ రెడ్డి, ఇన్నారెడ్డి, సూర్య నారాయణ, వెంకటనారాయణ రెడ్డి, లైన్స్ సీనియర్లు నాగన్న దత్తు, రీజినల్ చైర్మన్లు ఆర్ శ్రీనివాస్ రెడ్డి , రాజేంద్రప్రసాద్,ఏ టు జెడ్ శ్రీనివాసరెడ్డి, కేసరి శ్రీనివాసరెడ్డి, పెంటయ్య గౌడ్,జోన్ చైర్ పర్సన్ లయన్ వడ్లోజు జ్యోతిర్మయాచారి పావనిరెడ్డి,సుమలత,రమాదేవి,విజయ్ వాణీ తదితరులు పాల్గొన్నారు.




