Kapra: కాప్రా విజయ హైస్కూల్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర!

Kapra: కాప్రా ఆదిత్యనగర్ విజయ హైస్కూల్ ఆవరణలో పూరీ జగన్నాథ ఆధ్యాత్మిక రథయాత్ర ఘనంగా జరిగింది.

ASHOK, KAPRA
Published on: 24 July 2026 10:03 PM IST
Kapra
X

Kapra: కాప్రా విజయ హైస్కూల్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర!

Kapra: విజయ హైస్కూల్ ఆదిత్య నగర్,కాప్రా పాఠశాల ప్రాంగణం నుండి పూరి జగన్నాథ ఆధ్యాత్మిక రథయాత్ర ఊరేగింపు మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొప్పునూరి బసప్ప విజయలక్ష్మి దంపతులు స్వామి వారి రథానికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆధ్యాత్మిక రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విచ్చేసిన భక్తులు "జై జగన్నాథ్"నామస్మరణలతో మంగళ వాయిద్యాలతో మరియు కోలాటాల ప్రదర్శనలతో రథాన్ని వైభవంగా ముందుకు లాగారు. రథయాత్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. జగన్నాధుని రథాన్ని లాగితే సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది అని సంవత్సరమంతా గర్భగుడికే పరిమితమయ్యే భగవంతుడు కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ దర్శనం ఇవ్వడానికి స్వయంగా వీధుల్లోకి వచ్చే అరుదైన ఉత్సవం అని కొనియాడారు.

అనంతరం విజయ హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జగన్నాథ ఆధ్యాత్మిక రథయాత్ర మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తనల నడుమ ఘనంగా నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జగన్నాథస్వామి,బలబద్ధుడు మరియు సుభద్రదేవిల కృపాకటాక్షాలు పొందారు. కోలాటాల ప్రదర్శన,సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆధ్యంతం చూపరులను కట్టిపడేసాయి.

విశేషంగా ఆకట్టుకున్న వందల సంఖ్యలో స్వామివారికి అనేక వంటకాలతో మహా ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు మహాప్రసాదం మరియు తాగునీటి సౌకర్యాలను పాఠశాల యజమాన్యం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో, పాఠశాల చైర్మన్ కొప్పునూరు బసప్ప, వ్యవస్థాపకురాలు శకొప్పునూరు విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్, కోశాధికారి కే ప్రవీణ్ కుమార్, సభ్యులు ఎం.ధీరేశ్వర్, కరెస్పాండెంట్ కొప్పునూరి రాజేశ్వర్,డైరెక్టర్ వీణ, ప్రిన్సిపాల్ డి.వి. బాబు, ప్రధానోపాధ్యాయురాలు అద్దంకి పద్మావతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story