Kapra: ఆర్.కె ఎంక్లేవ్లో రూ.50 లక్షల సీసీ రోడ్డు పనుల పరిశీలన!
Kapra: కాప్రా డివిజన్ ఆర్.కె ఎంక్లేవ్లో రూ.50 లక్షల సీసీ రోడ్ల పనులను మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి కాంగ్రెస్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Kapra: ఆర్.కె ఎంక్లేవ్లో రూ.50 లక్షల సీసీ రోడ్డు పనుల పరిశీలన!
కాప్రా: మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి ఆర్ కె ఎంక్లేవ్ కాలనీలో కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు శ్రీహరి మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి 50లక్షల నిధులతో నిర్మాణంలో ఉన్న అంతర్గత సి సి రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించారు .నాణ్యతప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
అనంతరం భాస్కర్ రావ్ నగర్ కాలనీలో పర్యటించి కాలనీవాసులు తన దృష్టికి తీసుకొచ్చిన విధ్యుత్ మరియు యూబిడి పనులు వంటి సమస్యలను అతీత్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తమ కాలనీలో భూగర్భ డ్రైనేజి వ్యవస్థ(UGD), త్రాగునీటి పైప్ లైన్, ఆంతర్గత రోడ్ల భాస్కర్ రావ్ నగర్ కాలనీ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు స్వర్ణరాజ్ శివమణి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి పవన్ కుమార్, నరేందర్ గౌడ్, జి సత్యనారాయణ, తోటకూర శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ నాయకులు మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




