Kapra: కాప్రా డివిజన్‌లో రూ.2.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Kapra: కాప్రా డివిజన్‌లో రూ.2.15 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, తన్నీరు శ్రీహరి భూమిపూజ చేశారు.

ASHOK, KAPRA
Published on: 15 Oct 2026 10:12 PM IST
Kapra
X

Kapra: కాప్రా డివిజన్‌లో రూ.2.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

కాప్రా: కాప్రా డివిజన్ లో ని రాధాకృష్ణ పురం, కందిగూడ, సాయిబాబా ఆఫీసర్స్ కాలనీ, భాస్కర్ రావ్ నగర్ వినాయక నగర్ ఫేజ్-2 కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి తో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు శ్రీహరితో కలిసి భూమి చేశారు.

ఈ సందర్బంగా స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ - కాప్రా డివిజన్ లోని రాధాకృష్ణ పురం కాలనీలో 50లక్షల నిధులతో అంతర్గత సి సి రోడ్ల నిర్మాణం కందిగూడలో 40లక్షల నిధులతో ఫంక్షన్ హాల్ నిర్మాణం. సాయి బాబా ఆఫీసర్స్ కాలనీలో 27లక్షల నిధులతో అంతర్గత సి సి రోడ్ల నిర్మాణం , భాస్కర్ రావ్ నగర్ కాలనీలో 50లక్షల నిధులతో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం వినాయక నగర్ ఫేస్-2లో 48లక్షల.

నిధులతో అంతర్గత సి సి రోడ్ల భారీ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఉమ్మడి కాప్రా డివిజన్ అభివృద్ధికి తాను పాటుపడ్డానన్నారు. పదవీలేకున్నా ప్రజలు తన వద్దకు తీసుకొచ్చిన సమస్యలను ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డీ సహకారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నానన్నారు.

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉండడం వల్లే తాను రెండుమార్లు కార్పొరేటర్ గా సేవచేసే అవకాశం లభించిందన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభమవ్వడంతో కాలనీల రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ, అందుకు కృషిచేసిన మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి ధన్యవాదములు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారన్నారు.

ఈ సందర్బంగా కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు శ్రీహర మాట్లాడుతూ - రేవంతన్న ప్రజాపాలనలో కాప్రా డివిజన్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ , AMC డైరెక్టర్ పూర్ణయాదవ్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి పవన్ కుమార్,నరేందర్ గౌడ్, జి సత్యనారాయణ, రిజ్వాన్ ఖాన్, తోటకూర శ్రీకాంత్, సి సత్యనారాయణ, సత్తిరెడ్డి, నాగరాజు యాదవ్, సంతోష్ చారి, నర్సింగ్ రావ్, శివకుమార్, జి కృష్ణ,, మహిళా కాంగ్రెస్ నాయకులు జి లక్ష్మీ, స్వర్ణలత వివిధ కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA