Kapra: కాప్రా వాసులకు గుడ్ న్యూస్.. దశాబ్దాల సమస్యకు చెక్!
Kapra: కాప్రా డివిజన్ పరిధిలోని ఆర్.కే. ఎంక్లేవ్ నుండి సి.డి.ఎం వరకు రూ. 1.38 కోట్ల వ్యయంతో స్ట్రోమ్ వాటర్ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
Kapra: కాప్రా వాసులకు గుడ్ న్యూస్.. దశాబ్దాల సమస్యకు చెక్!
కాప్రా: కాప్రా డివిజన్ 1.38కోట్ల నిధులతో స్ట్రోమ్ వాటర్ బాక్స్ డ్రైన్ పనులు... స్వర్ణరాజ్ శివమణి కాప్రా డివిజన్ లోని ఆర్.కే.ఎంక్లేవ్ నుండి సి డి ఏం వరకు రూ 1.38కోట్ల నిధులతో ప్రారంభమైన స్ట్రోమ్ వాటర్ బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి ఈ సందర్బంగా స్వర్ణరాజ్ శివమణీ మాట్లాడుతూ కోటి ముప్పై ఎనిమిది లక్షల భారీ నిధులతో చేపడుతున్న స్ట్రోమ్ వాటర్వ బాక్స్ డ్రైన్ నిర్మాణంతో డివిజన్లోని వళ్లువర్ నగర్, సి డి యం, ఆర్ కే ఎంక్లేవ్ కాలనీలకు వర్షపు నీటి ముంపు సమస్య తీరనుందన్నారు.
వర్షం పడిన ప్రతిసారి వర్షపు వరదనీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారని, తాను వళ్లువర్ నగర్, సి డి యం, ఆర్ కే ఎంక్లేవ్ కాలనీల వర్షపు నీటి సమస్యను తీవ్రంగా ఉందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే రూ 1.38కోట్ల నిధులు మంజూరు చేయించి సమస్య పరిష్కారానికి కృషి చేశారని, డివిజన్ అభివృద్ధికి తనకు అండగా నిలుస్తూ భారీ నిధులు మంజూరు చేయిస్తూ ప్రోత్సహిస్తున్న పరమేశ్వర్ రెడ్డి కి ఈ సందర్బంగా ధన్యవాదములు తెలిపారు.
దశాబ్దాల వర్షపునీటి సమస్యను పరిష్కరిస్తున్న మాజీ కార్పొరేటర్ కు వళ్లువర్ నగర్, ఆర్ కే ఎంక్లేవ్ కాలనీల రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు, డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి,పొట్టు బాబురావు, జి సత్యనారాయణ, తన్నీరు శ్రీహరి, జగదీష్ గౌడ్, రిజ్వాన్ ఖాన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.




