Medipally: పీర్జాదిగూడలో కాగడాల ర్యాలీ అమరులకు ఏనుగు సుదర్శన్‌రెడ్డి
Medipally: పీర్జాదిగూడలో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ. కార్గిల్ అమరవీరులకు బీజేపీ మేడ్చల్ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి నివాళులర్పించారు.
Medipally: పీర్జాదిగూడలో కాగడాల ర్యాలీ అమరులకు ఏనుగు సుదర్శన్‌రెడ్డి
మేడిపల్లి: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధి పీర్జాదిగూడలో హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో ఆదివారం కాగడాల ర్యాలీ నిర్వహించారు.
చేతుల్లో జాతీయ జెండాలు, వెలిగిన కాగడాలతో "భారత్ మాతాకీ జై", "వందే మాతరం" నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ దేశభక్తి వాతావరణాన్ని తలపించింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, వారి సేవలను యావత్ దేశం ఎన్నటికీ మరువదని అన్నారు.
అమరవీరుల త్యాగస్ఫూర్తిని భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బండారు పవన్ రెడ్డి, రాము యాదవ్, గీతారామ్, మల్లారెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్‌తో పాటు హనుమాన్ యువసేన నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




