Hyderabad: హైదరాబాద్‌లో బెంగళూరు టెక్ సమ్మిట్ ఇంటరాక్షన్ మీట్!
Hyderabad: బెంగళూరులో నవంబర్ 17 నుంచి ఏఐ & బియాండ్ థీమ్‌తో జరిగే ఆసియా అతిపెద్ద టెక్ సమ్మిట్ 2026 నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్ నిర్వహించారు.
Hyderabad: హైదరాబాద్‌లో బెంగళూరు టెక్ సమ్మిట్ ఇంటరాక్షన్ మీట్!
Hyderabad: ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్‌గా పేరొందిన బెంగళూరు టెక్ సమ్మిట్ 2026 నవంబర్ 17 నుంచి 19 వరకు బెంగళూరులోని BIECలో ‘ఏఐ & బియాండ్’ థీమ్‌తో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారా హిల్స్ హోటల్ తాజ్ కృష్ణ లో కర్ణాటక ప్రభుత్వం ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్ నిర్వహించింది.
75కి పైగా దేశాల నుంచి టెక్ దిగ్గజాలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌లు, పరిశోధకులు పాల్గొనే ఈ సదస్సులో 1,800కు పైగా ఎగ్జిబిటర్లు, 25 వేలకు పైగా ప్రతినిధులు, 60 వేలకు పైగా బిజినెస్ సందర్శకులు హాజరయ్యారు. ఏఐ, సెమీకండక్టర్లు, బయోటెక్, స్టార్టప్‌లు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలకు ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది.




