Maheshwaram: ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కార్తీక్ రెడ్డి

Maheshwaram: ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ కాలయాపన చేస్తున్నారన్న కార్తీక్ రెడ్డి. మహేశ్వరం మెడికల్ కాలేజీని కొడంగల్ తరలించడంపై ఆగ్రహం.

SAI,	MAHESHWARAM
Published on: 30 Jun 2026 10:04 AM IST
Maheshwaram
X

Maheshwaram: ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కార్తీక్ రెడ్డి

మహేశ్వరం: మండల కేంద్రం లో మీడియా సమావేశం లో కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి 5 సార్లు మన ప్రాంతనికి రావడం జరిగింది. ఇపుడు హోట్ టాపిక్ మారింది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ గా ఈప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు.

అసలు ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది ఫార్మా సిటీకి ల్యాండ్ కేటాయిస్తే దానిలో ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు తప్ప ఫ్యూచర్ సిటీ లేదు అని కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయలలో KCR అధికారంలో ఉన్నప్పుడు బిగ్గెస్ట్ ఫార్మా సిటీ పెట్టి ఫార్మా సూటికెల్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రపంచంలో నే అతిపెద్ద ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలనుకున్నారు.

దూరదృష్ట్యవశాత్తు ఓడిపోవడం జరిగింది .ఆదే ఫార్మా కంపెనీల వస్తే ఎన్ని కోట్లరుపాయలు మనకు ఆదాయం వస్తుందో తెలుసా మనం అధికారం కోల్పోవడం జరిగింది రేవంత్ రెడ్డి వచ్చాక ఫార్మా సిటీ పోయి ఫ్యూచర్ సిటీ గా పేరు మార్చడం జరిగింది.

హైదరాబాద్ మహా నగరంలో అంతర్జాతీయ ఫార్మా కంపెనీల కోసమే ఫార్మా భూములు వాడుకోవాలని కోర్ట్ సూచించింది. కొంతమంది హైకోర్టుకి వెళ్లారు. కోర్ట్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం ఫార్మానే కడుతున్నామన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లెటర్ లో ఫ్యూచర్ సిటీ నే లేదు మరి ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది ? మన ప్రాంతం నుండి మెడికల్ కాలేజ్ కొడంగల్ తీసికెళ్లారు .

రెండున్నర ఏండ్ల నుండి ఫ్యూచర్ సిటీ అని చెబుతున్నారు ఇప్పటికి ఏమైనా ఒక్కకంపెనీ కి కూడా అగ్రిమెంట్ ఎందుకు చెయ్యలేదు ..ఫార్మా సిటీలో 3వేల ఎకరాలు మాత్రమే ఫార్మాకు ఇస్తున్నారు ఇది తెలుసుకోవాలి.

ఈ ప్రాంతానికి రావలసిన మెడికల్ కాలేజీ నుండి కొడంగల్ కు తీసుకోపోతే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీలో కలిపేందుకు గ్రామ పంచాయతీ సర్పంచులు తీర్మానం చేయాలని ఎందుకు అడుగుతున్నారు.

కందుకూరు లో ఉన్న సర్పంచులు తీర్మానం చేస్తేనే ఫ్యూచర్ సిటీలో కలిపారా అని ఆయన ప్రశ్నించారు.ఫ్యూచర్ సిటీ కడుతున్న ప్రభుత్వానికి ఎటువంటి జీవో కాపీ లేదని ఆరోపించారు. మహేశ్వరం hmda లో ఉండలనుకున్నారా లేక FCDA లో ఉండలనుకున్నారా.

ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం ను కలిపితే ఏమి లాభం చెప్పాలని కాంగ్రెస్ నాయకులకు ప్రశ్నించారు.. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం లో 3వ స్థానమే.. అసలు ఫ్యూచర్ సిటీ అని అంటున్న రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఆర్డర్ ఉందా ఉంటే చూపించండి అని అన్నారు.

SAI,	MAHESHWARAM

SAI, MAHESHWARAM