Hyderabad: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల తీరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టే!

Hyderabad: నిరుద్యోగులను మోసం చేసేందుకే కేటీఆర్ సభ పెట్టారని, కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒకే నాణానికి బొమ్మా బొరుసని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు ధ్వజం.

G. Govind, Medchal
Published on: 18 July 2026 5:37 PM IST
Hyderabad
X

Hyderabad: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల తీరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టే!

Hyderabad: కాంగ్రెస్.. బిఆర్ఎస్ రెండు పార్టీల తీరు దొంగ ..దొంగలు ఊర్లు పంచుకునేలా ఉంది

నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ పెట్టాడు

కేటీఆర్ నిరుద్యోగుల కోసం సభ పెట్టలేదు

వారి కుటుంబ ఉద్యోగాలు పోయినందుకు భాదతో సభ పెట్టాడు

బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీ లను అంధకారంలోకి నెట్టింది అయ్య కొడుకులు కాదా?

అసెంబ్లీ సాక్షిగా లక్ష 27 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి కేవలం 27 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది నిజం కాదా కేటీఆర్ సమాధానం చెప్పాలి

మూడు సార్లు గ్రూప్ వన్ పరీక్ష రాసేలా లీక్ లు చేసింది మీరు కాదా

అధికారంలోకి ఉన్నప్పుడు నిరుద్యోగులు.. విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చేసిన విషయం కేటిఆర్ మరిచిపోయాడు

మీ వల్ల ఎంత మంది నిరుద్యోగులు ఆత్మగోస పడ్డారో మరిచి పోయావా కేటీఆర్

పదేళ్ల అధికారంలో ఒక్కసారి అయిన యూనివర్సిటీలకు కేటీఆర్ ఎందుకు పోలేదో సమాధానం చెప్పాలి

VRO వ్యవస్థను తొలగించిది మీరు కాదా

నిరుద్యోగులను మోసం చేసి రెచ్చ గొట్టేందుకు కేటీఆర్ సభ పెట్టాడు

వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే సరూర్ నగర్ సభ

ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఊరుకో బెల్ట్ షాపు కేసీఆర్ ఇచ్చాడు

చంపిన వాడే సంతాప సభ పెట్టినట్టు ఇవాళ కేటీఆర్ సభ పెట్టాడు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు

వెయ్యు కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానని ప్రగల్భాలు పలికి ఒక్క రూపాయి ఇవ్వలేదు

నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న కాంగ్రెస్ రూపాయి ఇవ్వలేదు

ఇదే సరూర్ నగర్ స్టేడియం లో రాహుల్.. ప్రియాంక గాంధీల తో సభ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పాడు

యూత్ డిక్లరేషన్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు

కాంగ్రెస్ బిఆర్ ఎస్ రెండు పార్టీలు ఒకే నాణానికి చెందిన బొమ్మ.. బొరుసు లాంటివి

నిరుద్యోగులను ఈ రెండు పార్టీలు మోసం చేశాయి

యువతకు.. నిరుద్యోగులకు మా విజ్ఞప్తి ఈ రెండు పార్టీలు నమ్మకండి

నిరుద్యోగుల వెంట బీజేపీ ఉంది

యువత కోసం పోరాటాలకు బీజేపీ సిద్ధం అవుతుంది.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story