Keesara: చీర్యాల డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో విద్యుత్ సమస్యలు

Keesara: కీసర చీర్యాల డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ కాలనీవాసులు ఏఈని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ASHOK, KAPRA
Published on: 31 Aug 2026 6:42 PM IST
Keesara
X

Keesara: చీర్యాల డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో విద్యుత్ సమస్యలు

కీసర: కీసర లో ని చీర్యాల డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ కాలనీ వాసులు విద్యుత్ శాఖ ఏఈని కలిసి వినతిపత్రం సమర్పించారు.

కాలనీలోని ఇళ్లకు ఇప్పటివరకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యుత్ వినియోగంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఏఈ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రతి ఇంటికి ప్రత్యేకంగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు ఇబ్బందులు పడకుండా అధికారులు స్పందించి విద్యుత్ మీటర్ల ఏర్పాటు, సరఫరా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

కాలనీ వాసుల వినతిని పరిశీలించిన ఏఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనం దాస్ రమేష్ గౌడ్, మధు, గణేష్, లక్ష్మయ్య, గోపాల్, రాహుల్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story