Keesara: గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
Keesara: కీసర గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో 18వ గ్రాడ్యుయేషన్ డే. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవాలని చైర్మన్ రవీందర్ రెడ్డి పిలుపు.
Keesara: గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
కీసర: వేగంగా మారుతున్న ప్రపంచంలో కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు అనుకూలత, స్థితిస్థాపకత కలిగి ఉండటమే విజయానికి సులువైన మార్గమని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల చైర్మన్ జీఆర్. రవీందర్ రెడ్డి అన్నారు.
శనివారం కీసర మండలం చీర్యాలలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 18వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ మార్కెట్ లో సాంకేతిక రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.
కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటి, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎప్పటి కప్పుడు కొత్తవి నేర్చుకునే తపన, మార్పులను స్వీకరించే మనస్తత్వం మిమ్మల్ని ఎదుగుదల వైపు నడిపిస్తాయన్నారు.
అవకాశాలను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని, ఇందు కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. ఐసీ ఎఫ్ సిఏ డైరెక్టర్ సుధాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ఛైర్మన్ ఆర్. హరిశ్చంద్ర రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సాగర్, డైరెక్టర్ డాక్టర్ ఉదయ కుమార్ సుసర్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టా సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.




