Khairatabad: మంత్రి ఉత్తమ్‌కు బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ MGR బహిరంగ సవాల్

Khairatabad: ఖైరతాబాద్‌లో నీటి సమస్యలను స్వయంగా చూసేందుకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) బహిరంగ సవాల్ విసిరారు.

RAJESH,	WEST ZONE
Published on: 16 Nov 2026 10:14 PM IST
Khairatabad
X

Khairatabad: మంత్రి ఉత్తమ్‌కు బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ MGR బహిరంగ సవాల్

ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా MGR గారు మాట్లాడుతూ..

*“ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.. ఖైరతాబాద్‌కు రండి.. నాతో కేవలం 10 నిమిషాలు కేటాయించండి. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలను స్వయంగా చూపిస్తా.*

గల్లీల్లోకి వచ్చి ప్రజల పరిస్థితి చూస్తే మీకే వాస్తవాలు అర్థమవుతాయి. నీటి సమస్య లేదని నిరూపిస్తే ఖైరతాబాద్ సెంటర్‌లో మీ మాటకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధం.

ప్రతిరోజూ 8 వేలకు పైగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ జరుగుతున్నాయంటే నగరంలో నీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, మాదాపూర్ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో తాగేందుకు నీళ్లు లేవని చెబుతుంటే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం నీటి సమస్యే లేదంటున్నారు.

అసలు ప్రజలు ఎవరి మాటలు నమ్మాలి? ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమా? మంత్రి చెబుతున్నది నిజమా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మంత్రా.. లేక ప్రజలకు వాస్తవాలు దాచిపెడుతున్నారా?

*మాటలతో ప్రజలను మభ్యపెట్టడం మానేసి.. క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల నీటి కష్టాలను చూడండి!”* అని MGR గారు డిమాండ్ చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE