Khairatabad: ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పల్స్ పోలియో చుక్కలు వేసిన ఎంజీఆర్
Khairatabad: ఖైరతాబాద్ బడా గణేష్ లైబ్రరీ వద్ద పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి; ప్రతి చిన్నారికి చుక్కల పిలుపు.
Khairatabad: ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పల్స్ పోలియో చుక్కలు వేసిన ఎంజీఆర్
ఖైరతాబాద్: ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం, ఖైరతాబాద్ డివిజన్‌లోని బడా గణేష్ (లైబ్రరీ) వద్ద ఐదేళ్లలోపు చిన్నారులకు స్థానిక నాయకులతో కలిసి పల్స్ పోలియో చుక్కలు వేసిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు.
ఈ సందర్భంగా MGR గారు మాట్లాడుతూ.. ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో ముఖ్యమని అన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సురక్షితమైన భవిష్యత్తుకు పునాది వేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మరియం అజీజ్, ఆశా వర్కర్లు శాంతి, సంగీత, భార్గవి, జెసిమ్, ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు గజ్జల ఆనంద్, శామ్ గౌడ్, మారయ్య యాదవ్, శ్రీనివాస్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.




