Khairatabad: ఖైరతాబాద్ మహాగణపతి సేవలో జూటూరు కీర్తిరెడ్డి!
Khairatabad: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి. స్వామివారికి లడ్డూ ప్రసాదం సమర్పణ, ప్రత్యేక పూజలు.
Khairatabad: ఖైరతాబాద్ మహాగణపతి సేవలో జూటూరు కీర్తిరెడ్డి!
ఖైరతాబాద్: విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యుటీవ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. గణేష్ నవరాత్రి వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించిన 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి లడ్డూను సమర్పించారు.
ఈ సందర్భంగా కీర్తిరెడ్డికి సాదర స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సన్మానించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భక్తుల కష్టాలు తొలగి ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.




