Hyderabad: మే 10 మోదీ సభ విజయవంతం చేయాలి: కిషన్ రెడ్డి
Hyderabad: మే 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని మోదీ సభ విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Hyderabad
Hyderabad: భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో మే 10న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 10న జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులను తరలించాలని జిల్లా నాయకులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story




