Rajendranagar: తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం.. బంగారం, నగదు అపహరణ!
Rajendranagar: కిస్మత్‌పూర్‌లో చోరీ జరిగింది. బాధితుడు సుబ్బరామి రెడ్డి కుటుంబంతో అనంతపురం వెళ్లిన సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు.
Rajendranagar: తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం.. బంగారం, నగదు అపహరణ!
శంషాబాద్: గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధి లోని కిస్మత్‌పూర్‌లో చోరీ.. బంగారం, నగదు అపహరణ.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్ వివేకానంద కాలనీలో చోరీ జరిగింది.
బాధితుడు జె. సుబ్బరామి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నిర్మాణ పనుల కోసం అనంతపురానికి వెళ్లి తెల్లవారుజామున తిరిగి వచ్చి చూడగా ఇంటి ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ఉన్నట్లు గుర్తించారు.
ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉన్న ఇనుప అల్మారాను ధ్వంసం చేసి, అందులో ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.20 వేల నగదు, హాల్‌లో ఉన్న జూట్ బ్యాగ్‌లోని రూ.2 వేల చిల్లర నగదు, ఒక మొబైల్ ను గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




