NARMUL Mother Dairy: నార్ముల్ మదర్ డెయిరీ ఎండీగా కోదండపాణి

NARMUL Mother Dairy: నార్ముల్ మదర్ డెయిరీ నూతన ఎండీగా ఎన్‌డీడీబీ (NDDB) జనరల్ మేనేజర్ కోదండ పాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 2 Jun 2026 8:19 PM IST
NARMUL Mother Dairy
X

NARMUL Mother Dairy: నార్ముల్ మదర్ డెయిరీ ఎండీగా కోదండపాణి

NARMUL Mother Dairy: నార్ముల్ మదర్ డెయిరీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా కోదండ పాణిని నియమిస్తూ ఎన్డీడీబీ చెర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇప్పటివరకు ఎన్డీడీబీలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తుండగా మంగళవారం నార్ముల్ మదర్ డెయిరీ ఎండీ గా భాద్యతలు స్వీకరించారు. ఎన్డీడీబీతో ఒప్పందంలో భాగంగా గత నెల 23 నుండి నార్ముల్ మదర్ డెయిరీలో ఎన్డీడీబీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నార్ముల్ మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఎండీగా భాద్యతలు స్వీకరించిన కోదండపాణికి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ఎండీగా పనిచేసిన కాటిపల్లి లింగా రెడ్డిని సీఈఓగా నియమిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. పదేళ్లుగా నష్టాలలో కొనసాగుతున్న సంస్థను ఏడాదిలో లాభాల బాటలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఉద్యోగులు సహకరించాలని సూచించారు. ఎన్డీడీబీ ఒప్పందంలో నార్ముల్ మదర్ డెయిరీ తరపున విశేషంగా కృషిచేసిన ఉద్యోగి సామ మహిపాల్ రెడ్డి ని చైర్మన్ ప్రత్యేకంగా అభినందిస్తూ కండువాతో సత్కరించారు. నూతన ఎండీ కోదండ పాణి మాట్లాడుతూ.. తాను ఉద్యోగుల పక్షపతినని ఉద్యోగులంతా నిబద్దతతో పనిచేసి సంస్థ అభివృద్ధికి తొడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కర్నాటి జయశ్రీ ఉప్పల్ వెంకట్ రెడ్డి, పుప్పాల నర్సింహులు, ఎండీఐఎల్ ప్రతినిధి వై.వి.రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story