Kokapet: జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్!

Kokapet: గ్రేటర్ హైదరాబాద్ శివారు కోకాపేటలో హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర వైభవంగా జరిగింది.

ANJAIAH, SHAMSHABAD
Published on: 19 July 2026 9:38 PM IST
Kokapet
X

Kokapet: జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్!

శంషాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారు గండిపేట మండలం కోకాపేటలో ఘనంగా జగన్నాథ రథయాత్ర, జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

గండిపేట మండలం నార్సింగ్ సర్కిల్ కోకాపేట్ పరిధిలో హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.భారీగా తరలివచ్చిన భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే భక్తిశ్రద్ధలతో స్వామివారికి నమస్కరించి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్నాథ స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు.అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని కోరినట్లు వెల్లడించారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story