Qutubullapur: పుచ్చకాయ కేక్‌తో కోలా రవీందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు!

Qutubullapur: కుత్బుల్లాపూర్‌లో పర్యావరణ హితంగా సామాజికవేత్త కోలా రవీందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు. పుచ్చకాయ కేక్‌తో వేడుక, మహిళలకు చేతి సంచులు పంపిణీ.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 2 Sept 2026 9:51 AM IST
Qutubullapur
X

Qutubullapur: పుచ్చకాయ కేక్‌తో కోలా రవీందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు!

Qutubullapur: సామాజికవేత్త, పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు వినూత్నంగా, పర్యావరణహితంగా నిర్వహించారు. సాధారణంగా కేక్ కు సంప్రదాయానికి భిన్నంగా సహజసిద్ధంగా పండిన పుచ్చకాయను కేక్ కట్చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలకు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా చేతి సంచులను ఉచితంగా అందజేశారు.. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో మార్కెట్ కు వెళ్లినప్పుడు చేతి సంచులు వెంట తీసుకెళ్తాం.. ప్లాస్టిక్ కవర్లను వినియోగించమని, అంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయించారు..

ఈ సందర్భంగా పలువురు మహిళలు పర్యావరణ హితమైన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మార్పులతో పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చన్నారు. చేతి సంచుల వినియోగం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంతో పాటు రైతులు పండించే సహజ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు..

డ్రైనేజీలో టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు..

ఇటీవల హైదరాబాద్ లో డ్రైనేజీలను శుభ్రం చేస్తున్న సమయంలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడటం ఆందోళన కలిగించే షయమని రవిందర్ ముదిరాజ్ అన్నారు.. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా డ్రైనేజీలు, నాలాలు మూసుకుపోయి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం పలు ప్రాంతాల్లో నీటిముంపు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు..

ప్లాస్టిక్ ను మనం పారేసిన చోటనే ఆగిపోదని, చివరకు మనకే మారుతుందని అన్నారు.. పర్యావరణాన్ని కాపాడకపోతే భావితరాలకు మనమే అన్యాయం చేసిన వారమవుతామని రవీందర్ ముదిరాజ్ ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, అధికారులు, యువత, యులు ముందుకు రావాలని ఆయన కోరారు..

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story