Hyderabad: ఉద్యోగం లేక, అనారోగ్యంతో మనస్తాపం.. పేట్ బషీరాబాద్ పరిధిలో యువకుడి బలవన్మరణం
Hyderabad: హైదరాబాద్ శివార్లలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hyderabad: ఉద్యోగం లేక, అనారోగ్యంతో మనస్తాపం.. పేట్ బషీరాబాద్ పరిధిలో యువకుడి బలవన్మరణం
కొంపల్లి/పేట్ బషీరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కొంపల్లి హై విజన్ రెసిడెన్స్‌లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన రహీం భాయ్ (30), తండ్రి సల్మాన్ భాయ్, తన చెల్లెలు స్నేహ బిన్ సల్మాన్‌తో కలిసి గత రెండేళ్లుగా కొంపల్లిలో నివాసం ఉంటున్నా డు. శుక్రవారం ఉదయం స్నేహ తన ఉద్యోగా నికి వెళ్లగా, రహీం భాయ్ ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న స్నేహ, తలుపులు లోపల నుంచి గొళ్లెం వేసి ఉండటంతో పలుమార్లు
తలుపు తట్టినా స్పందన రాలేదని తెలిపింది. దీంతో స్థానికుల సహాయంతో కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించగా, రహీం అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఉద్యోగం లేకపోవడం, అనారోగ్య సమ స్యలతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రా థమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగి స్తున్నారు.




