Kothur: జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయులను సన్మానించిన సీఐ గురువయ్య గౌడ్
Kothur: కొల్తూరు జెడ్పీహెచ్‌ఎస్ లో ఉపాధ్యాయులను జినోమ్ వ్యాలీ సీఐ గురువయ్య గౌడ్ సన్మానించారు. విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించారు.
Kothur: జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయులను సన్మానించిన సీఐ గురువయ్య గౌడ్
కొల్తూరు: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్తూరు ZPHS హైస్కూల్‌లో ఉపాధ్యాయులను జినోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సీఐ గురువయ్య గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయులు కేవలం విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తన, దేశభక్తి వంటి మంచి లక్షణాలను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.
సమాజ అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని, విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు, సలహాలను పాటిస్తూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
అనంతరం విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




