Vikarabad: కోట్పల్లి ప్రాజెక్టులో 'తిరంగా బోట్ ర్యాలీ' పాల్గొన్న ఎంపీ!

Vikarabad: వికారాబాద్ కోట్పల్లి ప్రాజెక్టులో ఘనంగా తిరంగా బోట్ ర్యాలీ. త్రివర్ణ పతాకాలతో బోటింగ్‌లో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

MOGULAIAH, VIKARABAD
Published on: 14 Aug 2026 3:40 PM IST
Vikarabad
X

Vikarabad: కోట్పల్లి ప్రాజెక్టులో 'తిరంగా బోట్ ర్యాలీ' పాల్గొన్న ఎంపీ!

Vikarabad: కోట్పల్లి ప్రాజెక్టులో దేశభక్తి భావాన్ని చాటుతూ తిరంగా బోట్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను బోట్లపై అలంకరించి, త్రివర్ణ పతాకాలతో బోటింగ్ సిబ్బంది తో కలసి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బోటింగ్ కోఆర్డినేటర్ రాములు ఆధ్వర్యంలో బోటింగ్ సిబ్బంది, జాతీయ సమైక్యత, దేశభక్తి మరియు జాతీయ జెండా గౌరవాన్ని ప్రజల్లో చాటిచెప్పారు.

కోట్పల్లి ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ నిర్వహించిన ఈ తిరంగా బోట్ ర్యాలీ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

“దేశం కోసం – దేశ ఐక్యత కోసం” అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.

ఈ కార్యక్రమంలో బోటింగ్ కోఆర్డినేటర్ రాములు మరియు బోటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story