Cherlapally: జన విజ్ఞాన వేదిక ఉచిత వేసవి సైన్స్ శిబిరం ప్రారంభం!

Cherlapally: చర్లపల్లి ఈసీ నగర్‌లోని కృప విజ్ఞాన్ సైంటిఫిక్ స్కూల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి సైన్స్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది.

ASHOK, KAPRA
Published on: 21 April 2026 6:03 PM IST
Cherlapally
X

Cherlapally: జన విజ్ఞాన వేదిక ఉచిత వేసవి సైన్స్ శిబిరం ప్రారంభం!

Cherlapally: విద్యార్థులు తమ ఇళ్లలో, పాఠశాలల్లో మరియు సమాజంలో మంచి విలువలతో మెలగాలని, శాస్త్రీయ దృక్పథంతో సమాజాభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

చర్లపల్లి లో ని ఈసీ నగర్ లో కృప విజ్ఞాన్ సైంటిఫిక్ స్కూల్‌లో జన విజ్ఞాన వేదిక మరియు పాఠశాల యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి సైన్స్ శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

శిక్షణ శిబిరంలో భాగంగా టీచర్ శివకుమార్ గ విద్యార్థులకు పలు రకాల మ్యాజిక్లను ప్రదర్శించి, వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ లాజిక్కులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రబలుతున్న మూఢనమ్మకాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని,

ఉన్నత చదువులు చదివిన వారు కూడా చిన్న చిన్న ట్రిక్కులను నమ్మి మోసపోవడం విచారకరమని అన్నారు. విద్యార్థులంతా ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి పిట్టల నాగరాజు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తోట శ్రీనివాస్, జిల్లా కోశాధికారి జెన్నీ, సీనియర్ నాయకులు శేషగిరిరావు, పాఠశాల కరస్పాండెంట్ శరత్ సుదర్శి, ప్రధానోపాధ్యాయులు కృపా సుదర్శి, ఉపాధ్యాయులు రీటా, మిశ్రా, అర్జున్, కిరణ్, కుమారి మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story