Kukatpally: కేపీహెచ్‌బీలో ఘోరం నిద్రిస్తున్న రూమ్‌మేట్‌పై కత్తితో దాడి!

Kukatpally: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో నిద్రిస్తున్న రూమ్‌మేట్‌పై కత్తితో దాడి చేసిన సత్తిబాబు.

Maruthisagar, Kukatpally
Published on: 5 Sept 2026 7:38 AM IST
Kukatpally
X

Kukatpally: కేపీహెచ్‌బీలో ఘోరం నిద్రిస్తున్న రూమ్‌మేట్‌పై కత్తితో దాడి!

Kukatpally: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూమ్‌మేట్‌పై కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో జరిగిన గొడవ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్‌ఐజీ-41లో సత్తిబాబు, రాజేష్‌ తదితరులు కలిసి నివసిస్తున్నారు.

సత్తిబాబు, రాజేష్‌ మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. మద్యం మత్తులో ఉన్న సత్తిబాబు.. నిద్రిస్తున్న రాజేష్‌పై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉన్న రాజేష్‌ను సహచరులు ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం పరారైన సత్తిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story