Malkajgiri: తెలుగు భాషా వికాసానికి అక్షర కౌముది సేవలు ప్రశంసనీయం!
Malkajgiri:
Malkajgiri: తెలుగు భాషా వికాసానికి అక్షర కౌముది సేవలు ప్రశంసనీయం!
మల్కాజ్గిరి: తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 18,19 తేదీలు శని ఆది వారాలలో పద్మావతి ఫంక్షన్ హాల్ మల్కాజిగిరి కళా కౌముది నల్లన్ చక్రవర్తుల సాహిత్ అవధానం గురు సహస్రవదాని డా కడిమిళ్ళ వరప్రసాద్ సంచాలకత్వంలో జరిగే స్వర్ణవదాన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ మల్కాజిగిరి లో ఆదివారం జరిగింది.
ఈ కార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రముఖ అవధానులు విచ్చేసి మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి భాష పరిరక్షణకు అక్షర కౌముది సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని పలువురు సాహితీ వేత్తలు పేర్కొన్నారు.
అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మీ మాట్లాడుతూ అక్షర కౌముది సంస్థ అనేక రంగాల్లో సేవలందిస్తూ సాహిత్య సేవల్లో భాగంగా అవధాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సాహితీ రసజ్ఞులైన అందరికీ సాదర స్వాగతం అందరూ పాల్గొనవచ్చు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహా మహోపాధ్యాయ డా దోర్భల ప్రభాకర శర్మ , మారుమాముల దత్తాత్రేయ శర్మ డా ధూళిపాళ మహాదేవమణి ఆముదాల మురళీ,మండపాక మహేశ్వరి,డా జి ఎం రామ శర్మ, పెన్నా మధుసూదన్,దర్శనం పత్రిక సంపాదకులు మారుమాముల రుక్మిణీ వెంకటరమణ శర్మ,అక్షర కౌముది సంస్థ ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి, కోశాధికారి బచ్చల మాధవి,వ్యవస్థాపక అధ్యక్షులు డా తులసి వెంకట రమణా చార్యులు, లక్ష్మణా చారి,రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.




