Hyderabad: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ కసరత్తు!

Hyderabad: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల నేతలతో చర్చిస్తున్న కేటీఆర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2026 4:20 PM IST
Hyderabad
X

Hyderabad: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ కసరత్తు!

Hyderabad: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలతో వరుసగా కేటీఆర్ సమావేశం అవుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానాల్లో పార్టీ అభ్యర్ధులను బరిలోకి దించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్ లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో కేటీఆర్ విడివిడిగా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జ్ లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్