Medchal: పూడూరు విద్యార్థిని శ్రీ లాస్యకు అంతర్జాతీయ స్వర్ణ రికార్డు అవార్డు!

Medchal: మేడ్చల్ మండలం పూడూరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని తోకల శ్రీ లాస్య కూచిపూడి నృత్యంలో విశిష్ట ప్రతిభకు అంతర్జాతీయ స్వర్ణ రికార్డుల పురస్కారం వరించింది.

NAKSHATRAM, MEDCHAL
Published on: 25 July 2026 7:48 AM IST
Medchal
X

Medchal: పూడూరు విద్యార్థిని శ్రీ లాస్యకు అంతర్జాతీయ స్వర్ణ రికార్డు అవార్డు!

Medchal: మేడ్చల్ మండలం పూడూర్–కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని తోకల శ్రీ లాస్య అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచి సార్వత్రిక స్వర్ణ రికార్డుల సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది.

మేడ్చల్‌లోని నాగార్జున మాంటిస్సోరి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీ లాస్య, ప్రముఖ నృత్య గురువు డాక్టర్ గల్వ యుగమణి ఆధ్వర్యంలోని నాట్య మయూరి కళాక్షేత్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతోంది. ఆమె నృత్య ప్రతిభను గుర్తించిన సార్వత్రిక స్వర్ణ రికార్డుల సంస్థ ఈ అరుదైన గౌరవాన్ని ప్రదానం చేసింది.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ చైర్మన్ జునాపూడి రవివర్మ చేతుల మీదుగా విద్యార్థిని తోకల శ్రీ లాస్యకు, ఆమె తల్లిదండ్రులు తోకల శ్రీనివాస్, ప్రశాంతి సమక్షంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ గల్వ యుగమణి మాట్లాడుతూ, శ్రీ లాస్య కృషి, అంకితభావం వల్లే ఈ అరుదైన గౌరవం దక్కిందని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

పాఠశాల యాజమాన్యం, నాట్య మయూరి కళాక్షేత్రం సభ్యులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు విద్యార్థిని శ్రీ లాస్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, గురువు డాక్టర్ గల్వ యుగమణిని అభినందించారు. పూడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని ఈ ఘనత సాధించడం గ్రామానికి, మేడ్చల్ ప్రాంతానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story