Kukatpally: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్‌ఎస్!

Kukatpally: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్‌ను నిరసిస్తూ కూకట్‌పల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం.

Maruthisagar, Kukatpally
Published on: 7 Sept 2026 11:33 AM IST
Kukatpally
X

Kukatpally: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్‌ఎస్!

Kukatpally: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ దిష్టిబొమ్మను దహనం చేశారు.

మాజీ కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, శిరీష బాబురావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు.

భూములను 22-ఏలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తూ సామాన్యులకు గజం భూమి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story