Kukatpally: కూచిపూడి నృత్యాలతో అలరించిన చిన్నారులు

Kukatpally: కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీలో కూచిపూడి నృత్య విభావరి. ఆధ్యాత్మిక గీతాలు, పౌరాణిక వేషధారణలతో అలరించిన చిన్నారులు.

Maruthisagar, Kukatpally
Published on: 22 Sept 2026 7:31 PM IST
Kukatpally
X

Kukatpally: కూచిపూడి నృత్యాలతో అలరించిన చిన్నారులు

కూకట్‌పల్లి: వివేకానందనగర్ కాలనీ అపార్ట్‌మెంట్స్ ప్రాంగణంలోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు.

మయూరి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో, అకాడమీ నిర్వాహకులు శ్రీదేవి, నందిత పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, చిన్నారులు ప్రత్యేక వేషధారణలతో ఆధ్యాత్మిక గీతాలు, రామదాసు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, గణపతి పాటలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

విష్ణుమూర్తి, పరమశివుడు, జగన్మాత తదితర వేషధారణల్లో చిన్నారులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం కాలనీ అసోసియేషన్ సభ్యుల చేతుల మీదుగా నృత్యకారులకు బహుమతులు అందజేశారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally