Kukatpally: ఆల్విన్ కాలనీలో ఓటరు నమోదు సవరణ ప్రక్రియ పరిశీలన
Kukatpally: కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్‌లో ప్రత్యేక ఓటరు నమోదు సవరణ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు జిల్లా గణేష్ నేత, శ్రీనివాస్ నాయక్.
Kukatpally: ఆల్విన్ కాలనీలో ఓటరు నమోదు సవరణ ప్రక్రియ పరిశీలన
కూకట్ పల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు సవరణ ప్రక్రియను కాంగ్రెస్ నాయకులు జిల్లా గణేష్ నేత, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, బోయ కిషన్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వో ఇన్‌చార్జి సీఓ ముస్తఫా, సంబంధిత బీఎల్‌వోలతో కలిసి నమోదు ప్రక్రియను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా గణేష్ నేత మాట్లాడుతూ, షిఫ్టెడ్ ఓటర్ల వివరాలను గుర్తించి వారికి సమాచారం అందించి, అవసరమైన మార్పులు చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రత్యేక సవరణ ప్రక్రియను వంద శాతం విజయవంతం చేసేందుకు ప్రజలు, ఓటర్లు సహకరించాలని కోరారు.
Next Story




