Hyderabad: ఆల్విన్ కాలనీలో డీసీ చాముండేశ్వరి ఆకస్మిక తనిఖీలు!
Hyderabad: కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆకస్మిక తనిఖీ.
Hyderabad: ఆల్విన్ కాలనీలో డీసీ చాముండేశ్వరి ఆకస్మిక తనిఖీలు!
కూకట్‌పల్లి: ఆల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్ఠంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు (SFAలు) ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, చెత్త తొలగింపు, డ్రెయినేజీల శుభ్రత, నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రజల నుంచి అందే ఫిర్యాదులను గరిష్టంగా 12 గంటల టర్న్ అరౌండ్ టైమ్లో పరిష్కరించి, తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు. వర్షాల సమయంలో ఎక్కడైనా నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులకు సత్వర స్పందన ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు.




