Kukatpally: అంజయ్య నగర్‌లో ఎస్టీఎఫ్ ఆకస్మిక దాడి: గంజాయి ప్యాకెట్లు సీజ్!
Kukatpally: కూకట్‌పల్లి అంజయ్య నగర్‌లో ఎస్టీఎఫ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు. ఒక కేజీ గంజాయి స్వాధీనం, విక్రయిస్తున్న మహిళ కుదినేత సోని అరెస్ట్.. కేసు నమోదు.
Kukatpally: అంజయ్య నగర్‌లో ఎస్టీఎఫ్ ఆకస్మిక దాడి: గంజాయి ప్యాకెట్లు సీజ్!
Kukatpally: కూకట్పల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అంజయ్య నగర్ లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఏ టీం సీఐ రమేష్ సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కుదినేత సోని అనే మహిళ వద్ద ఒక కేజీ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఆమెపై కేసు నమోదు చేశారు. గంజాయి పట్టుకున్న కేసులో సీఐతోపాటు ఎస్సై మధు, హెడ్ కానిస్టేబుల్ సంతోష్ ప్రసాద్, కానిస్టేబుళ్లు రవి, రాహుల్, రాజేశ్వరి, ఖలీద్ ఉన్నారు. నిందితురాలని, గంజాయిని కూకట్పల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ రమేష్ తెలిపారు.




