Kukatpally: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణహిత వినాయకుల తయారీ
Kukatpally: కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణహిత వినాయకుల తయారీ వర్క్‌షాప్. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన పిలుపు.
Kukatpally: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణహిత వినాయకుల తయారీ
కూకట్‌పల్లి: వినాయక చవితిని పురస్కరించుకొని కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈకో క్లబ్, లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణహిత వినాయకుల తయారీ కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులు మట్టి, సహజ పదార్థాలతో విగ్రహాలను రూపొందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనిక రంగుల వినియోగాన్ని తగ్గించి, మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. కరుణాకర్, ఈకో క్లబ్ కన్వీనర్ డా. టి. ఉత్తర ఫాల్గుణి, విభాగాధిపతులు ఏ. గోపాల్, సౌజన్యతో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.




