Kukatpally: కూకట్‌పల్లిలో విద్యార్థులకు బ్యాగులు, ఆట వస్తువులు పంపిణీ

Kukatpally: కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా బాగ్ అమీర్ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, ప్లేట్లు, ఆట వస్తువులు పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు.

Maruthisagar, Kukatpally
Published on: 24 July 2026 8:52 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లిలో విద్యార్థులకు బ్యాగులు, ఆట వస్తువులు పంపిణీ

కూకట్ పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) 50వ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, బాగ్ అమీర్‌లో విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు బ్యాగులు, భోజన ప్లేట్లు, ఆట వస్తువులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

విద్యార్థుల విద్యాభివృద్ధి, మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాగులు, ప్లేట్లతో పాటు క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులు, స్కిప్పింగ్ రోపులు, స్నేక్ అండ్ లాడర్స్, లూడో తదితర ఆట సామగ్రిని అందజేశామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు గొట్టుముకుల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, తీగల కృష్ణారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story