Kukatpally: అల్లాపూర్‌లో ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే

Kukatpally: కూకట్‌పల్లి అల్లాపూర్‌లో సర్వే నంబర్ 18 ప్రభుత్వ భూమిని పరిశీలించి, పాఠశాల నిర్మాణానికి నిధులు కోరిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

Maruthisagar, Kukatpally
Published on: 27 July 2026 6:31 PM IST
Kukatpally
X

Kukatpally: అల్లాపూర్‌లో ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్‌లోని సర్వే నంబర్ 18లో ఉన్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ స్థలంలో తెలుగు, ఉర్దూ మాధ్యమ పాఠశాల, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ భూమిపై ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని భూమిని పరిరక్షించాలని కోరారు.

పాఠశాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సభియా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, లింగాల ఐలయ్య, పిల్లి తిరుపతి, జిలాని, నూర్ ఖాన్, మోయిజ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story