Serilingampally: శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ ‘SIR’ అవగాహన సదస్సు!
Serilingampally: గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎస్ఐఆర్ (SIR) సదస్సు.
Serilingampally: శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ ‘SIR’ అవగాహన సదస్సు!
Serilingampally: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో ఎంఎస్ కన్వెన్షన్ హాల్‌లో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (SIR) అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కూకట్‌పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతి బీఎల్ఏ పూర్తి అవగాహనతో పనిచేయాలని, ఓటర్ల వివరాల పరిశీలనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రజల హక్కులను పరిరక్షించడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలోపేతంగా పనిచేయాలని, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గులాబీ జెండా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రెపరెపలాడడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగారావు, బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు, మాజీ డివిజన్ అధ్యక్షులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ ఏరియా కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.




