Kukatpally: కేటీఆర్ జన్మదినం సందర్భంగా 2 వేల మందికి చీరల పంపిణీ

Kukatpally: కూకట్‌పల్లిలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా 2 వేల మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

Maruthisagar, Kukatpally
Published on: 24 July 2026 8:43 PM IST
Kukatpally
X

Kukatpally: కేటీఆర్ జన్మదినం సందర్భంగా 2 వేల మందికి చీరల పంపిణీ

కూకట్ పల్లి: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా శుక్రవారం బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2 వేల మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేటీఆర్ పిలుపు మేరకు సాలువాలు, బొకేలు, హోర్డింగ్స్‌పై ఖర్చు చేసే డబ్బును నిరుపేదలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

కేటీఆర్ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం గురించే ఆలోచిస్తారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ అభివృద్ధి దిశగా పార్టీ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ హరనాథ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story